Shai Hope: విండీస్ ఓపెనర్ షాయ్ హోప్ సెంచరీ... టీమిండియా ముందు భారీ టార్గెట్

Windies set 300 plus target to Team India with Shai Hope ton
  • పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో రెండో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్
  • రాణించిన విండీస్ టాపార్డర్
  • కెప్టెన్ పూరన్ అర్ధసెంచరీ
వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా ముందు 312 పరుగుల లక్ష్యం నిలిచింది. విండీస్ ఓపెనర్ షాయ్ హోప్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. షాయ్ హోప్ సెంచరీ సాయంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. షాయ్ హోప్ 135 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 8 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. 

కెప్టెన్ నికోలాస్ పూరన్ 77 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 74 పరుగులు చేయడం విశేషం. అంతకుముందు, ఓపెనర్ కైల్ మేయర్స్ 39, షామ్రా బ్రూక్స్ 35 పరుగులు చేశారు. బ్రాండన్ కింగ్ డకౌట్ అయ్యాడు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, దీపక్ హుడా 1, అక్షర్ పటేల్ 1, చహల్ 1 వికెట్ తీశారు.
Shai Hope
Century
West Indies
Team India
2nd ODI
Port Of Spain

More Telugu News