YV Subba Reddy: విశాఖకు పరిపాలనా రాజధాని ఖాయం: వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy held meeting with GVMC corporators
  • విశాఖలో వైవీ పర్యటన
  • వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ హోదాలో కార్పొరేటర్లతో సమావేశం
  • ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంశంపై వ్యాఖ్యలు
  • న్యాయపరమైన చిక్కులు తొలగిపోతే వస్తుందని వెల్లడి
వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి నేడు విశాఖలో పర్యటించారు. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాక పరిపాలనా రాజధాని వస్తుందని వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. 

ఇక, గోదావరి వరదలు, విపక్షాల విమర్శలపైనా వైవీ స్పందించారు. కేవలం ఉనికి కోసమే గోదావరి వరదలపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
YV Subba Reddy
Visakhapatnam
Executive Capital
YSRCP

More Telugu News