Pawan Kalyan: కాలికి తగిలిన గాయం వల్ల కేటీఆర్ ప్రజాసేవకు అంతరాయం కలిగినట్టు తెలిసింది: బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan conveys birthday wishes to KTR
  • నేడు కేటీఆర్ 46వ పుట్టినరోజు
  • ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపిన పవన్
  • కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా కేటీఆర్ కు విషెస్ తెలిపారు. 

టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి, సహృదయులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. కాలికి తగిలిన గాయం వల్ల కేటీఆర్ ప్రజాసేవకు అంతరాయం కలిగినట్టు తెలిసిందని వెల్లడించారు. గాయం నుంచి కోలుకుని ఆయన యథావిధిగా ప్రజాసేవలో మమేకం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కేటీఆర్ కు దీర్ఘాయుష్షు, ఆనందకరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Pawan Kalyan
KTR
Birthday
TRS
Janasena
Telangana

More Telugu News