Anand Mahindra: హైద‌రాబాద్‌లో మ‌హీంద్రా వ‌ర్సిటీ తొలి స్నాత‌కోత్సవం... ముఖ్య అతిథిగా హాజ‌రైన కేటీఆర్‌

ktr attends as chief guest to mahindra university forst convocation
షార్ట్స్‌లో చూడండి
భార‌త పారిశ్రామిక దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా... హైద‌రాబాద్‌లో మ‌హీంద్రా యూనివ‌ర్సిటీ పేరిట ఓ అత్యున్న‌త స్థాయి ప్ర‌మాణాల‌తో విద్యా సంస్థ‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ యూనివ‌ర్సిటీకి చెందిన తొలి బ్యాచ్ విద్యార్థులు త‌మ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం వ‌ర్సిటీ క్యాంప‌స్‌లో తొలి స్నాత‌కోత్స‌వం జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థుల‌కు ప‌ట్టాలు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌ర్సిటీ వ్య‌వ‌స్థాప‌కుడు, మ‌హీంద్రా కంపెనీ య‌జ‌మాని ఆనంద్ మ‌హీంద్రా స‌హా కంపెనీకి చెందిన ప‌లువురు ముఖ్యులు హాజ‌ర‌య్యారు.
Go Back to Shorts
Anand Mahindra
KTR
Hyderabad
Telangana
TRS

More Telugu News