ఫ్లిప్ కార్ట్ పై గూగుల్ పిక్సల్ 6ఏ ముందస్తు ఆర్డర్ల స్వీకరణ మొదలు

  • ఈ నెల 28 నుంచి గూగుల్ పిక్సల్ 6ఏ విక్రయాలు
  • 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో ఒకటే వేరియంట్
  • ధర రూ.43,999.. యాక్సిస్ కార్డుపై రూ.4,000 తగ్గింపు
Pixel 6a now on sale in India at special launch price of Rs 39999

గూగుల్ పిక్సల్ 6ఏ ఫోన్ల విక్రయాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ పై ముందస్తు ఆర్డర్లు మొదలయ్యాయి. ప్రీ ఆర్డర్ చేస్తే 28వ తేదీ నుంచి డెలివరీలు మొదలవుతాయి. పిక్సల్ 4ఏ తర్వాత గూగుల్ నుంచి వస్తున్న ఫోన్ ఇదే. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో ఒకటే వేరియంట్ గా లభిస్తుంది. దీని ధర రూ.43,999. 

యాక్సిస్ కార్డుతో చెల్లింపులు చేసే వారికి రూ.4,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ.39,999కే ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే పిక్సల్ ఫోన్ ను వాడుతున్న వారు దానిని మార్పిడి చేసుకుంటే రూ.6,000 తగ్గింపు లభిస్తుంది. ఇతర అన్ని ఫోన్ల ఎక్సేంజ్ పై రూ.2,000 తగ్గింపును గూగుల్ ఆఫర్ చేస్తోంది.

పిక్సల్ 6ఏ కొనుగోలు చేసేవారు, నెస్ట్ హబ్ జెన్2, ఫిట్ బిట్ ఇన్ స్పైర్ 2, పిక్సల్ బడ్స్ ఏ సిరీస్ ను రూ.4,500కే సొంతం చేసుకోవచ్చు. మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం ఉచితంగా లభిస్తుంది. అలాగే, 100జీబీ క్లౌడ్ స్టోరేజీ గూగుల్ వన్ నుంచి ఉచితంగా పొందొచ్చు. 

గూగుల్ సొంత చిప్ టెన్సార్ తో ఇది పనిచేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రోజు కంటే ఎక్కువే వస్తుందని గూగుల్ చెబుతోంది. ఫొటోలు అద్భుతంగా రావడానికి తగిన సాంకేతికతను ఈ ఫోన్లో గూగుల్ ఏర్పాటు చేసింది. ఫోన్ లో డేటాకు అధిక భద్రత, నీరు పడినా పాడైపోకుండా ఐపీ67 రక్షణతో పిక్సల్ 6ఏ వస్తుంది.

More Telugu News