KA Paul: ఆగస్ట్ 15 తర్వాత ఆమరణదీక్ష చేపడతా: కేఏ పాల్

  • ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగిన కేఏ పాల్
  • తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని నిరసన
  • విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్
Will take up hunger strike after August 15 says KA Paul

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధర్నా చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని... దీనికి వ్యతిరేకంగా తాను ధర్నా చేపట్టినట్టు ఆయన తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్రం నెరవేర్చడం లేదని ఆయన మండిపడ్డారు. తక్షణమే అన్ని అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని, ఏపీకి ప్రత్యేకహోదాను ఇవ్వాలని అన్నారు. ఎనిమిదేళ్లుగా విభజన హామీలను ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని... లేనిపక్షంలో ఆగస్ట్ 15వ తేదీ తర్వాత ఆమరణ నిరాహారదీక్షను చేపడతానని హెచ్చరించారు.

More Telugu News