Bhumana Karunakar Reddy: దొంగ ఓట్లు వేసే వాళ్లను టీడీపీ వాళ్లే తీసుకొచ్చారు: భూమన కరుణాకర్ రెడ్డి

TDP bringing fake voters says Bhumana Karunakar Reddy
  • తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు
  • 12 డైరెక్టర్ పదవుల కోసం జరుగుతున్న ఎన్నికలు
  • దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ పరస్పరం ఆరోపించుకుంటున్న వైసీపీ, టీడీపీ

తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. మొత్తం 12 డైరెక్టర్ పదవులకు గాను ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ కూడా దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయిస్తున్నారని మండిపడ్డారు. 

మరోవైపు, ఈ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ... కావాలనే టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. దొంగ ఓట్లు వేసే వ్యక్తులను టీడీపీ వాళ్లే తీసుకొచ్చారని విమర్శించారు. దొంగ ఓటర్లను వాళ్లే తీసుకొచ్చి... ఇక్కడ ఏదో జరుగుతోందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద దొంగ ఓట్లు అంటూ డ్రామాలకు తెర లేపారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News