India: దేశంలో లక్షన్నరకు చేరువవుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

20557 New Cases reported in last 24 hours
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 20,557 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 15 వేల వరకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో 40 మంది మరణించారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువవుతోంది. ప్రస్తుతం దేశంలో 1,45,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

దేశంలో ఇప్పటి వరకు 4,31,32,140 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 2,00,61,24,684 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 6,11,01,105 మంది ప్రికాషన్ డోసు వేయించుకున్నారు. 


Go Back to Shorts
India
Corona Virus
Active Cases

More Telugu News