కోల్ కతాలో మరో మోడల్ ఆత్మహత్య
- 21 ఏళ్ల మోడల్ పూజ ఆత్మహత్య
- బోయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత సూసైడ్ చేసుకున్న వైనం
- ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు
తాజాగా కోల్ కతాకు చెందిన మరో మోడల్ పూజ సర్కార్ (21) ఆత్మహత్య చేసుకుంది. తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని ఆమె సూసైడ్ చేసుకుంది. తన బోయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.