TRS: స‌ర్కారీ బ‌డుల విద్యార్థుల కోసం రూ.1.06 కోట్లు వెచ్చించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... అభినందించిన మంత్రి హ‌రీశ్ రావు

trs mla Gudem Mahipal Reddy buy above 1 crore rupees value of note books for government school children
  • 37 వేల మంది విద్యార్థుల‌కు 2.3 ల‌క్ష‌ల నోట్ బుక్కుల కొనుగోలు
  • అందుకోసం రూ.1.06 కోట్లు ఖ‌ర్చు చేసిన మ‌హిపాల్ రెడ్డి
  • విద్యార్థుల‌కు నోట్ బుక్కుల‌ను పంపిణీ చేసిన మంత్రి హ‌రీశ్
ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్య‌న‌భ్య‌సిస్తున్న చిన్నారుల కోసం టీఆర్ఎస్ నేత‌, ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి కోట్ల కొల‌ది నిధుల‌ను వెచ్చిస్తున్నారు. ఇందులో భాగంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు నోట్ బుక్కుల కొనుగోలు కోసం ఆయ‌న ఏకంగా రూ.1.06 కోట్ల‌ను ఖ‌ర్చు చేశారు. ఈ నోట్ బుక్కుల‌ను మంగ‌ళ‌వారం ప‌టాన్‌చెరులో ప‌ర్య‌టించిన మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు విద్యార్థుల‌కు అంద‌జేశారు. 

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్ధుల‌కు సాయం చేసిన మ‌హిపాల్ రెడ్డిని హ‌రీశ్ రావు ఆకాశానికెత్తేశారు. త‌న సొంత నిధుల‌తో ఎమ్మెల్యే ఈ నోట్ బుక్కుల‌ను కొనుగోలు చేశార‌ని హ‌రీశ్ రావు తెలిపారు. రూ.1.06 కోట్ల‌తో 37,000 మంది విద్యార్థుల కోసం 2,30,000 నోట్ బుక్కుల‌ను ఎమ్మెల్యే కొన్నార‌ని మంత్రి తెలిపారు.
TRS
Harish Rao
Patancheru
Gudem Mahipal Reddy

More Telugu News