CM Jagan: సింగపూర్ ఓపెన్ విజేత పీవీ సింధుకు ఏపీ సీఎం జగన్ అభినందనలు

CM Jagan appreciates PV Sindhu who won maiden Singapore Open title
  • సింగపూర్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సింధు
  • ఫైనల్లో చైనా షట్లర్ వాంగ్ జీ యీపై విజయం
  • ఈ సీజన్ లో ఇది మూడో టైటిల్
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్, విజయసాయిరెడ్డి
సింగపూర్ ఓపెన్ విజేతగా ఆవిర్భవించిన తెలుగమ్మాయి పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇవాళ జరిగిన ఫైనల్లో సింధు చైనా షట్లర్ వాంగ్ జీ యీపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియాలో స్పందించారు. 

సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. సింగపూర్ ఓపెన్ టోర్నీలో సింధుకు ఇదే తొలి టైటిల్ అని తెలిపారు. కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిళ్లు గెలిచిన తర్వాత ఈ ఏడాది ఆమె సాధించిన మూడో టైటిల్ అని సీఎం జగన్ వివరించారు. 

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా సింధు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సింధు భారత్ కు గర్వకారణమని అభివర్ణించారు. ఈ సీజన్ లో మూడో టైటిల్ గెలిచి అంతకంతకు మెరుగవుతోందని కొనియాడారు. సింధు ఇదే ఒరవడి కొనసాగించి, భారతావనికి మరింత శోభ తీసుకురావాలని అభిలషించారు.
CM Jagan
PV Sindhu
Singapore Open
Singles Title
Andhra Pradesh
Telangana
India

More Telugu News