Telangana: వ‌ర‌ద ప్రాంతాల్లో కేసీఆర్ ప‌ర్య‌టించిన బస్సు ఇదే

natikonal media focussed on a bus which kcr travelled in flood effected areas
  • వాతావ‌ర‌ణం అనుకూలించ‌క రోడ్డు మార్గం మీదుగా కేసీఆర్ ప్ర‌యాణం
  • అందుకోసం బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సును వినియోగించిన అధికారులు
  • బ‌స్సుపై నేష‌న‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున క‌థ‌నాలు
వ‌ర‌ద ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వేకు వాతావ‌ర‌ణం అనుకూలించ‌ని నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ నుంచి భ‌ద్రాచలం వ‌చ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం మీదుగా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ద నీటిలో మునిగిపోయిన ములుగు, ఏటూరు నాగారం మీదుగా కేసీఆర్ భ‌ద్రాచలం వెళ్లారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌యాణించేందుకు అధికార యంత్రాంగం ఓ బ‌స్సును వినియోగించింది. ఈ బ‌స్సుపై నేష‌న‌ల్ మీడియాలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌సారమ‌వుతున్నాయి.

సాధార‌ణంగా సీఎంల ప‌ర్య‌ట‌న కోసం ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు బుల్లెట్ ప్రూఫ్‌తో కూడిన బ‌స్సుల‌ను కొనుగోలు చేస్తున్నాయి. అందులో భాగంగా సీఎం కేసీఆర్ టూర్ కోసం కూడా తెలంగాణ ప్ర‌భుత్వం ఓ బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సును కొనుగోలు చేసింది. ఈ బ‌స్సులోనే కేసీఆర్ వ‌రంగ‌ల్ నుంచి భ‌ద్రాచ‌లం వెళ్లారు. రోడ్ల‌పై వర్ష‌పు నీటిలోనే ఈ బ‌స్సు వెళుతుండ‌గా... ఆ బ‌స్సును సీఎం కాన్వాయ్‌లోని కార్లు అనుసరించాయి. ఈ ఫొటోలు నేష‌న‌ల్ మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నాయి.
Telangana
TRS
KCR
Flood
Bullet Proof Bus
National Media

More Telugu News