భాగ్యనగరిలో బోనాలు షురూ... అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తలసాని, రేవంత్
- తెల్లవారుజామున తొలి బోనాన్ని సమర్పించిన మంత్రి తలసాని
- నగరంలోని నలుమూలల నుంచి పోటెత్తిన భక్తజనం
- రేవంత్ రెడ్డి రాక సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత
ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బారీకేడ్లను తోసుకుంటూ ఆయన ఆలయం లోపలకు ప్రవేశించారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోగా... పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఆలయం లోపలకు వెళ్లిన రేవంత్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.