Chess Olympiad: చెస్ బోర్డుగా మారిపోయిన చెన్నై బ్రిడ్జి... ఎందుకంటే..!

  • ఈ నెల 28 నుంచి మామ‌ళ్లాపురంలో చెస్ ఒలింపియాడ్‌
  • ఈ టోర్న‌మెంట్‌కు గుర్తుగా చెస్ గ‌ళ్ల‌తో నిండిపోయిన బ్రిడ్జి
  • చెన్నై వాసుల‌ను ఆక‌ట్టుకుంటున్న నేపియ‌ర్ బ్రిడ్జి
Napier Bridge in chennai decked up like a chessboard

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో నేపియ‌ర్ బ్రిడ్జి ఓ ల్యాండ్ మార్క్ కిందే లెక్క‌. మొన్న‌టిదాకా మామూలు బ్రిడ్జిగానే ఉన్న ఇది శ‌నివారం నాటికి చెస్ బోర్డుగా మారిపోయింది. బ్రిడ్జి ఉప‌రిత‌లంతో పాటు బ్రిడ్జికి ఉన్న రెయిలింగ్ గోడ‌లు కూడా చెస్ బోర్డు మాదిరిగా మారిపోయాయి. బ్రిడ్జి మొత్తం చెస్ బోర్డులోని తెలుపు, న‌లుపు గ‌ళ్ల‌తో నిండిపోయింది. రాత్రికి రాత్రే ఇలా మారిపోయిన ఈ బ్రిడ్జి ఇప్పుడు చెన్నైవాసుల‌ను ఆక‌ట్టుకుంటోంది. 

అయినా ఈ బ్రిడ్జి ఇలా చెస్ గ‌ళ్లతో నిండిపోవ‌డానికి ఓ కార‌ణం ఉంది. త‌మిళ‌నాడులోని మామ‌ళ్లాపురంలో ఈ నెల 28 నుంచి 44వ ఫైడ్ చెస్ ఒలింపియాడ్ మొద‌లు కానుంది. అంత‌ర్జాతీయ చెస్ స‌మాఖ్య (ఫైడ్‌) ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నున్న ఈ చెస్ ఒలింపియాడ్‌కు గుర్తింపుగా నేపియ‌ర్ బ్రిడ్జి ఇలా చెస్ గ‌ళ్ల‌తో నిండిపోయింది.

More Telugu News