Balakrishna: కొండారెడ్డి బురుజు నేపథ్యంలో బాలయ్య ఫైట్స్!

Gopichand Malineni movie update
  • ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలయ్య సినిమా 
  • కథానాయికగా నటిస్తున్న శ్రుతి హాసన్ 
  • ప్రతినాయకుడిగా దునియా విజయ్ 
  • డిసెంబర్ 2వ తేదీన సినిమా విడుదల 
రాయలసీమ నేపథ్యంతో కూడిన సినిమా అనగానే, ఆ సినిమాలో అక్కడి 'కొండారెడ్డి బురుజు' కనిపించవలసిందే. కర్నూల్ ప్రజలు అక్కడి కొండారెడ్డి బురుజును పౌరుషానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. అందువలన ఫ్యాక్షన్ సినిమాలలో హీరోయిజానికి సంబంధించిన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తుంటారు.

ఆ మధ్య వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోను .. రీసెంట్ గా వచ్చిన 'ది వారియర్' సినిమాలోను 'కొండారెడ్డి బురుజు దగ్గర తీసిన సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు అక్కడే బాలయ్యపై కొన్ని సీన్స్ ను గోపీచంద్ మలినేని ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఆ చుట్టుపక్కల మరికొన్ని లొకేషన్స్ ను కూడా ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. 

గోపీచంద్ మలినేని రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలోనే ఈ సినిమాను చేస్తున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, దునియా విజయ్ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.
Balakrishna
Sruthi Haasan
Gopechand maloneni Movie

More Telugu News