New Delhi: ఢిల్లీలో దారుణం.. టెన్త్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి కారులోనే సామూహిక అత్యాచారం

tenth girl gang raped in national capital
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
  • మాయమాటలు చెప్పి బాలికను కారు ఎక్కించుకున్న నిందితులు
  • నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారం
  • బాలిక స్నేహితుడు సహా ముగ్గురి అరెస్ట్
పదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన ఇద్దరు దుండగులు అందులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 6న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. వసంత విహార్‌లోని మార్కెట్‌లో బాధిత బాలిక పదో తరగతి చదువుతోంది. ఇద్దరు యువకులు ఆమెను మభ్యపెట్టి కారు ఎక్కించుకున్నారు. 

నిందితులు ఇద్దరితోపాటు బాలిక స్నేహితుడు కూడా వారి వెంట ఉన్నాడు. అనంతరం బాలికను మహిపాల్‌పూర్‌ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులతోపాటు బాలిక స్నేహితుడిని కూడా అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
New Delhi
Gang Rape
Girl
Kidnap
Pocso

More Telugu News