Haifa: ఇజ్రాయెల్ పోర్టునూ సొంతం చేసుకున్న గౌతం అదానీ

  • ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్టు టెండ‌ర్ ద‌క్కించుకున్న అదానీ గ్రూప్‌
  • ఇజ్రాయెల్ సంస్థ గాడోట్‌తో క‌లిసి టెండ‌ర్ వేసిన వైనం
  • ఈ టెండ‌ర్‌తో ఇరు దేశాల మ‌ధ్య బంధాలు బ‌ల‌ప‌డ‌తాయ‌న్న అదానీ
Adani Group win the tender for privatization of the Port of Haifa in Israel

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గౌతం అదానీ దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీలోని ప‌లు నౌకాశ్ర‌యాలు స‌హా దేశంలోని చాలా పోర్టుల‌ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్ సంస్థ‌ల అధినేత‌... తాజాగా ఇజ్రాయెల్‌లోనూ ఓ పోర్టును త‌న హ‌స్త‌గ‌తం చేసుకున్నారు. ఈ మేర‌కు గురువారం రాత్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌యంగా అదానీనే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్టు ప్రైవేటీక‌ర‌ణ టెండ‌ర్‌ను ద‌క్కించుకున్న‌ట్లు గౌతం అదానీ ప్ర‌క‌టించారు. ఇజ్రాయెల్‌కు చెందిన మ‌రో కీల‌క సంస్థ గాడోట్‌తో క‌లిసి ఈ టెండ‌ర్‌ను ద‌క్కించుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ టెండ‌ర్ త‌మ‌కు ద‌క్క‌డం ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌న్న అదానీ... ఈ టెండ‌ర్ ద్వారా ఇజ్రాయెల్‌, భార‌త్‌ల మ‌ధ్య మ‌రింత స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణం నెల‌కొంటుంద‌ని ప్ర‌క‌టించారు.

More Telugu News