Gadikota Srikanth Reddy: శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా శ్రీకాంత్ రెడ్డి... క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Cabinet status to Srikanth Reddy
  • ఇటీవల మంత్రి పదవి వస్తుందని ప్రచారం
  • నూతన మంత్రివర్గంలో శ్రీకాంత్ రెడ్డికి దక్కని చోటు
  • తాజాగా కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమించారు. అంతేకాదు, ఆ పదవికి క్యాబినెట్ హోదా కూడా కల్పించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాంత్ రెడ్డి ఈ క్యాబినెట్ హోదాతో రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 

శ్రీకాంత్ రెడ్డి... సీఎం జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల నూతన మంత్రివర్గంలో ఆయనకు తప్పకుండా స్థానం లభిస్తుందని ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో, శ్రీకాంత్ రెడ్డిని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకాంత్ రెడ్డి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Gadikota Srikanth Reddy
Cabinet Status
YSRCP
Andhra Pradesh

More Telugu News