ఒకే వేదికపై సందడి చేయనున్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్?

  • ఆగస్ట్ 5న విడుదల కాబోతున్న కల్యాణ్ రామ్ 'బింబిసార' చిత్రం
  • ప్రీరిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించాలనుకుంటున్న మేకర్స్
  • ఈవెంట్ కు వచ్చేందుకు బాలయ్య ఒప్పుకున్నట్టు సమాచారం
Balakrishna and Junior NTR to share same dias

బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకే సినిమాలో కనిపిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే, ఇంతవరకు వారి ఆకాంక్ష నెరవేరలేదు. మరోవైపు వీరిద్దరూ ఒకేచోట కలిసి కూడా చాలా కాలం అవుతోంది. నందమూరి హరికృష్ణ మృతి సమయంలోనే వీరు ఒకేచోట కనిపించారు. ఆ తర్వాత వీరు ఒకేచోట కనిపించలేదు. తాజాగా ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. బాలయ్య, తారక్ ఇద్దరూ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారనేదే ఆ వార్త. 

కల్యాణ్ రామ్ హీరోగా సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు తారక్ హాజరుకాబోతున్నాడు. అంతేకాదు ఈవెంట్ కు రావడానికి బాలయ్య కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే, దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు పండగే.

More Telugu News