చరణ్ సినిమా కోసం వచ్చేసిన కియారా!

12-07-2022 Tue 19:13 | Entertainment
  • షూటింగు దశలో శంకర్ సినిమా
  • హైదరాబాదులో కొనసాగుతున్న చిత్రీకరణ 
  • రేపటి నుంచి హాజరు కానున్న కియారా 
  • వేసవిలో సినిమాను విడుదల చేసే ఛాన్స్  
Kiara in Shankar movie
చరణ్ హీరోగా శంకర్ ఒక భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. చరణ్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి కియారా హైదరాబాద్ వచ్చింది. 

చరణ్ .. కియారా కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రేపటి నుంచి 15 రోజుల పాటు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలలో శ్రీకాంత్ .. సునీల్ కూడా పాల్గొననున్నట్టు చెబుతున్నారు. ఈ షెడ్యూల్ షూటింగుతో 60 శాతం చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు. 

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పాటలను ప్రత్యేకమైన సెట్స్ లోను .. మరికొన్ని విదేశాలలోను చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఇందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టుగా టాక్. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.