ఉదయనిధి స్టాలిన్ కు బంగారు గొలుసు బహూకరించిన బోనీ కపూర్

  • ఉదయనిధి, బోనీ కపూర్ కాంబినేషన్లో వచ్చిన 'నెంజుక్కు నీది' సినిమా
  • 50 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకున్న చిత్రం
  • 50 రోజుల ఫంక్షన్ ను నిర్వహించిన చిత్ర యూనిట్
Boney Kapoor gifts gold chain to Udayanidhi Stalin

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్... ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు రెండు రంగాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'నెంజుక్కు నీది' సినిమా ఘన విజయం సాధించింది. 50 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత, దివంగత శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించారు. 

మరో వైపు 50 రోజుల ఫంక్షన్ ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు, పంపిణీదారులకు బోనీ కపూర్, ఉదయనిధి స్టాలిన్ షీల్డ్స్ బహూకరించారు. హీరో ఉదయనిధి స్టాలిన్ కు బోనీ కపూర్ బంగారు గొలుసును గిఫ్ట్ గా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ... ఈ సినిమా విజయం వెనుక అందరి కష్టం ఉందని చెప్పారు. త్వరలోనే సొంత బ్యానర్ లో సినిమా చేస్తానని... ఆ తర్వాత బోనీ కపూర్ బ్యానర్ లో మరో సినిమా చేస్తానని చెప్పారు. 

బోనీకపూర్ మాట్లాడుతూ, మంచి కథతో కూడిన చిత్రాలను నిర్మించడమే తమ లక్ష్యమని తెలిపారు. తమిళంలో వరుస సినిమాలు చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఉదయనిధితో మరో సినిమా చేస్తానని తెలిపారు. ఉదయనిధి సినీ, రాజకీయ ప్రయాణం బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

More Telugu News