IOCL: ఈ గ్యాస్ సిలిండ‌ర్ పేల‌ద‌ట‌!.. ఇండేన్ కొత్త‌ సిలిండ‌ర్ వివ‌రాలివిగో!

gwmc mayer gundu sudharani releases iocl blast proof gas cylinder
  • బ్లాస్ట్ ప్రూఫ్ సిలిండ‌ర్ పేరిట స‌రికొత్త సిలిండ‌ర్‌
  • నూత‌న సిలిండ‌ర్‌ను రూపొందించిన ఐఓసీఎల్‌
  • తొలి సిలిండ‌ర్‌ను ఆవిష్క‌రించిన వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణి
ఇంటిలో గ్యాస్ సిలిండ‌ర్ ఉందంటే... జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. లేదంటే... ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా... సిలిండ‌ర్ పేలిందంటే... పెద్ద ప్రమాదమే. అయితే, అలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టే క్రమంలో స‌రికొత్త గ్యాస్ సిలిండ‌ర్ ఇప్పుడు మార్కెట్లోకి వ‌చ్చింది.

పేలుడు మాటే వినిపించ‌ని రీతిలో గ్యాస్ సిలిండ‌ర్‌ను బ్లాస్ట్ ప్రూఫ్ ప‌ద్ద‌తిలో ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) రూపొందించింది. ఇండేన్ పేరిట ఐఓసీఎల్ గ్యాస్ సిలిండ‌ర్ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంస్థ రూపొందించిన కొత్త‌ సిలిండ‌ర్ ఎలాంటి ప‌రిస్థితిలో కూడా పేల‌ద‌ట‌.

సాధార‌ణంగా గృహ వినియోగం కోసం మ‌నం వాడుతున్న సిలిండ‌ర్ల‌లో 14 కేజీల గ్యాస్ వ‌స్తుండ‌గా... ఈ బ్లాస్ట్ ప్రూఫ్ సిలిండ‌ర్ మాత్రం 10 కేజీల్లో మాత్ర‌మే ల‌భ్య‌మ‌వుతుంద‌ట‌. ఈ సిలిండ‌ర్‌ను సోమవారం గ్రేట‌ర్‌ వ‌రంగ‌ల్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీడ‌బ్ల్యూఎంసీ) మేయ‌ర్ గుండు సుధారాణి ఆవిష్క‌రించారు.
IOCL
Indane
Blast Proof
Gas Cylinder
GWMC
Gundu Sudharani
GWMC Mayer

More Telugu News