boAt Storm Pro: చౌక ధరకే బోట్ నుంచి స్మార్ట్ వాచ్

boAt Storm Pro smartwatch with AMOLED display launched in India
  • ఆరంభ ధర రూ.2,999
  • 700కు పైగా ఫిట్ నెస్ మోడ్ లు
  • అమోలెడ్ డిస్ ప్లే
  • మూడు రంగుల్లో లభ్యం
ఒకప్పుడు రిస్ట్ వాచ్ అంటే.. సమయాన్ని చూసుకునే సాధనం. ఆ తర్వాత ఇది ఫ్యాషన్ వేర్ గా మారిపోయింది. ఇప్పుడు స్మార్ట్ గా మారి ఎన్నో ఫీచర్లతో వినియోగదారులకు సౌకర్యవంతమైన గ్యాడ్జెట్ అవతారంతో దూసుకుపోతోంది. పెరుగుతున్న స్మార్ట్ వాచ్ ట్రెండ్ కు తగ్గట్టు.. ప్రముఖ సంస్థ బోట్ స్మార్ట్ ప్రో పేరుతో స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. 

దీని ధర కేవలం రూ.2,999. 1.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 60 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ఇందులో 700కు పైగా ఫిట్ నెస్ మోడ్ లు ఉన్నట్టు కంపెనీ చెబుతోంది. గుండెకు స్పందనలను రీడ్ చేసుకోవచ్చు. ప్రతి క్యాలరీ ఖర్చును ఇది నోట్ చేస్తుంది. 24 గంటల పాటు హార్ట్ రేట్ ను పర్యవేక్షించే సెన్సార్, రక్తంలో ఆక్సిజన్ ను సూచించే ఎస్పీవో2, నిద్ర ట్రాకింగ్, నడిచే అడుగులను లెక్కించడం ఇలా ఫిట్ నెస్ ఫీచర్లు బోలెడు ఉన్నాయి.  

రూ.2,999 ఆరంభ ధరగా కంపెనీ పేర్కొంది. యాక్టివ్ బ్లాక్, కూల్ గ్రే, డీప్ బ్లూ రంగుల్లో లభించే ఈ స్మార్ట్ వాచ్ ను.. ఫ్లిప్ కార్ట్, బోట్ లైఫ్ స్టయిల్ డాట్ కామ్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
boAt Storm Pro
smartwatch
launched
AMOLED display

More Telugu News