ఈద్ సందర్భంగా బార్డర్ లో స్వీట్లు పంచుకున్న భారత్–పాకిస్థాన్ సైనికులు
- గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద స్వీట్ల పంపిణీ
- శుభాకాంక్షలు చెప్పుకున్న ఇరు దేశాల సైనికులు
- ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన గుజరాత్ బీఎస్ఎఫ్ విభాగం
ఇస్లాం మతస్తులు త్యాగానికి గుర్తుగా ‘ఈద్ ఉల్ అదా (బక్రీద్)’ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున కొత్త వస్త్రాలు ధరించి, సామూహికంగా నమాజ్ చేస్తారు. గొర్రె పోతునుగానీ, మేక పోతునుగానీ కోసి.. దాని మాంసాన్ని పేదలకు పంచుతారు.