Tollywood: ‘బ్లాక్​ బస్టర్’​ తర్వాత ‘రా రా రెడ్డి’ ఐటమ్​ సాంగ్​లో అంజలి స్టెప్పులు అదుర్స్​

 Nithiin and Anjali Steals the show in Ra Ra Reddy item song
  • 'మాచర్ల నియోజకర్గం' చిత్రంలో ప్రత్యేక పాట విడుదల
  • నితిన్ తో కలిసి హుషారుగా స్టెప్పులేసిన అంజలి
  • ఆగస్టు 12న విడుదల కానున్న చిత్రం
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. రాజ‌శేఖ‌ర్ రెడ్డి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్‌ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక పాటను విడుదల చేశారు. 

‘రా రా రెడ్డి’ అనే ఈ మాస్ బీట్ ఐటమ్ లో నితిన్ తో పాటు హీరోయిన్ అంజలి నర్తించింది. అల్లు అర్జున్ తో ‘బ్లాక్ బస్టర్’ పాట తర్వాత అంజలి చేసిన ఐటమ్ సాంగ్ ఇదే. ఇందులో తన అందచందాలతో పాటు స్టెప్పులతో అలరించింది అంజలి. నితిన్ కూడా మంచి డ్యాన్సర్ కావడంతో ఇద్దరూ పోటీ పడి డ్యాన్స్ చేశారు. 

ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా లిప్సిక ఆలపించింది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించాడు. మంచి ఫామ్ లో ఉన్న జానీ మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫి చేశాడు. ఆరంభం నుంచి చివరి వరకు ఈ పాట హుషారుగా సాగింది. పాట చివర్లో అప్పట్లో నితిన్ హీరోగా వచ్చిన ‘జయం’ సినిమాలోని ‘రాను రాను అంటూనే సిన్నదో’ లిరిక్స్ మరింత ఆసక్తి కలిగించింది. యూ ట్యూబ్ లో విడుదలైన ఈ పాట ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తోంది.  

భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత చెక్, రంగ్ దే, మాస్ట్రో వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోయాయి. దాంతో, తాజా చిత్రంపై నితిన్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. 
.
Tollywood
nitin reddy
anjali
ra ra reddy
item song
macharla niyojakavargam movie

More Telugu News