Thousands of shoppers: అర్ధరాత్రి చౌక ధరలు.. షాపింగ్ కు వరదలా వచ్చిన కస్టమర్లు

Thousands of shoppers flood Keralas Lulu mall outlets for midnight sale
  • కేరళ వ్యాప్తంగా లులూ షాపింగ్ మాల్స్ లో ఇదే పరిస్థితి
  • 50 శాతానికి పైగా డిస్కౌంట్ ప్రకటించిన సంస్థ
  • దీంతో వేలాది మంది తోసుకుంటూ వచ్చిన వైనం
కోచిలోని ‘లులూ’ షాపింగ్ మాల్ కు ప్రజలు భారీగా తరలివచ్చిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కేరళలోని తిరువనంతపురం, కోచి లో ఉన్న లులూ అవుట్ లెట్ల వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ భారీ డిస్కౌంట్లు ప్రకటించడం వల్లే జనం ఇలా వరదలా వచ్చేశారు.

జూలై 6న అర్ధరాత్రి, 7న ఉదయం దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. సామాజిక మాధ్యమాల్లోకి చేరిన ఈ వీడియోలు అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. మాల్స్ బయట, లోపల, ఎలివేటర్ ఎక్కడ చూసినా జనం వేలం వెర్రిని తలపించారు. అన్ని ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపును లులూ ఆఫర్ చేసింది. ఇంత భారీ రద్దీ ఉన్నా, తొక్కిసలాట చోటుచేసుకోకపోవడం అద్భుతమంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. మన దేశ జనాభాలో ఎక్కువ మంది డిస్కౌంట్ కోరుకుంటారు. దాన్నే విక్రయాలకు మార్గంగా లులూ గ్రూపు చేసుకుంది.
Thousands of shoppers
kerala
shopping
lulu shopping mall
heavy crowd

More Telugu News