Ram: ఈ సినిమా విషయంలో నేను కాస్త ఇబ్బంది పడ్డాను: కృతి శెట్టి

The Ghost movie update
  • కృతి శెట్టి నాలుగో సినిమాగా 'ది వారియర్'
  • ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కృతి శెట్టి
  • రేడియో జాకీ పాత్రలో కనిపిస్తానంటూ వివరణ 
  • తన పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందంటూ వ్యాఖ్య 
టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి కృతి శెట్టి చేసిన ప్రతి సినిమా హిట్టే. ఇప్పటికే ఈ బ్యూటీ హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఆ తరువాత సినిమాగా ఆమె చేసిన 'ది వారియర్' ఈ నెల 14వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో రామ్ - కృతి శెట్టి ఇద్దరూ కూడా బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు లింగుసామి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 

తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ .. "నా మాతృభాష 'తుళు' .. తెలుగు బాగానే మాట్లాడతాను. ఇంతవరకూ తెలుగు బాగా తెలిసిన దర్శకులతోనే చేశాను. లింగుసామిగారి తెలుగులో తమిళ యాస ఉంటుంది. నాకు తమిళం తెలియదు .. అందువలన ఆయన మాట్లాడే తెలుగు అర్థం అయ్యేది కాదు. 

అలా ఒక వారం రోజుల పాటు ఇబ్బంది పడ్డాను. రామ్ గారికి తమిళం కూడా బాగా వచ్చు. అందువలన ఆయన సపోర్ట్ తీసుకున్నాను. లింగుసామి గారు ఏం చెబుతున్నారనేది నాకు రామ్ గారు చెప్పేవారు. ఆ తరువాత నేను అలవాటు పడిపోయాను. ఈ సినిమాలో నేను రేడియో జాకీగా కనిపిస్తాను. నా పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చింది.
Ram
Krithi Shetty
Lingusawmy
The Warrior Movie

More Telugu News