ఢిల్లీలో మ‌హారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం... కేంద్రం పెద్ద‌ల‌తో వ‌రుస భేటీలు

08-07-2022 Fri 21:40
  • రాత్రికి అమిత్ షాతో భేటీ కానున్న షిండే, ఫ‌డ్న‌వీస్‌
  • శ‌నివారం కూడా ఢిల్లీలోనే ఉండ‌నున్న నేత‌లు
  • రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి, న‌డ్డా, రాజ్‌నాథ్‌ల‌ను క‌ల‌వనున్న‌ట్లు స‌మాచారం
maharashtra cmshinde and deputy cm fadnavis reaches delhi
మ‌హారాష్ట్ర నూత‌న సీఎం ఏక్ నాథ్ షిండే, నూత‌న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌లు శుక్ర‌వారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభానికి ముగింపు ప‌లికి కొత్త స‌ర్కారును ఏర్పాటు చేసిన షిండే, ఫ‌డ్న‌వీస్‌లు... ఆ త‌ర్వాత తొలిసారిగా శుక్ర‌వారం ఢిల్లీ వెళ్లారు. శుక్ర‌వారం రాత్రే వీరిద్ద‌రూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్న‌ట్లు స‌మాచారం. 

శ‌నివారం కూడా ఢిల్లీలోనే ఉండ‌నున్న షిండే, ఫ‌డ్న‌వీస్‌లు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడుతోనూ భేటీ కానున్నారు. ఆ త‌ర్వాత బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ల‌తోనూ భేటీ కానున్నట్లు స‌మాచారం.