Swaero: ఈ రోజు క‌ట్నం లేకుండా జ‌రిగిన ఓ పెళ్లికి సాక్షి సంత‌కం పెట్టా: బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్‌ కుమార్

bsp telangana chief rs praveen kumar attends a Swaero marriage in Jedcharla
  • స్వేరో పేరిట కొత్త ఉద్య‌మాన్ని మొద‌లుపెట్టిన ప్ర‌వీణ్
  • జ‌డ్చర్ల‌లో స్వేరో వివాహం జ‌రిగింద‌ని వెల్ల‌డి
  • స్వేరో వివాహాల్లో వ‌ర‌క‌ట్నం నిషేధ‌మ‌ని తెలిపిన వైనం
ఐపీఎస్ స‌ర్వీస్‌కు స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి తెలంగాణ‌ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన బీఎస్పీ తెలంగాణ అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స‌రికొత్త దిశ‌గా అడుగులు వేస్తున్నారు. పాద‌యాత్ర పేరిట తెలంగాణ‌ను చుట్టేస్తున్న ప్ర‌వీణ్‌... శుక్ర‌వారం ఓ ఆస‌క్తిక‌ర అంశాన్ని వెల్ల‌డిస్తూ ట్వీట్ చేశారు. జ‌డ్చ‌ర్ల‌లో క‌ట్నం లేకుండా జ‌రిగిన ఓ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యాన‌ని చెప్పిన ప్ర‌వీణ్‌... ఆ వివాహానికి సాక్షిగా సంత‌కం కూడా చేశాన‌ని వెల్ల‌డించారు. 

ఈ సంద‌ర్భంగా తాను మొద‌లుపెట్టిన స్వేరో ఉద్య‌మాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. తాను హాజ‌రైన వివాహంలో స్వేరో ఉద్య‌మంలో భాగ‌స్వాములుగా ఉన్న యువ‌తీ యువ‌కులే పెళ్లి చేసుకున్నార‌ని తెలిపారు. ఈ వివాహాన్ని స్వేరో వివాహంగా పేర్కొన్న ఆయ‌న స్వేరో వివాహాల్లో వ‌ర‌క‌ట్నం నిషేధం అని తెలిపారు. వ‌ర‌క‌ట్నం లేకుండానే జ‌రిగిన ఈ పెళ్లికి తాను సాక్షిగా సంత‌కం పెట్టాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌ధూవ‌రులిద్ద‌రి మ‌ధ్య నిల‌బ‌డి సాక్షి సంత‌కం పెడుతున్న త‌న ఫొటోను త‌న ట్వీట్‌కు ఆయ‌న జ‌త చేశారు.
Swaero
Telangana
BSP
RS Praveen Kumar
Jedcharla

More Telugu News