Prabhas: ప్రభాస్ తో కొరటాల సినిమా ఖాయమేనట!

  • ఎన్టీఆర్ సినిమా పనుల్లో కొరటాల 
  • త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు 
  • ప్రభాస్ నుంచి మాట తీసుకున్న కొరటాల
  • 2025లో సినిమా ఉండే ఛాన్స్  
Prabhas in Koratala Movie

చిత్రపరిశ్రమకి రచయితగా పరిచయమైన కొరటాల, విజయవంతమైన కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రను పోషించాడు. ఆ తరువాత దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకుని 'మిర్చి' సినిమాను తెరకెక్కించాడు. ప్రభాస్ కెరియర్లోనే ఆ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. త్వరలో మళ్లీ ఈ కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్టుగా సమాచారం.

'మిర్చి' సినిమా నుంచి 'ఆచార్య' వరకూ కొరటాల వరుసగా భారీ విజయాలను అందుకుంటూ వచ్చాడు. అయితే 'ఆచార్య' విషయంలో ఆయన అంచనాలు తలక్రిందులు అయ్యాయి. ఆ సినిమా నష్టాలతో పాటు విమర్శలను కూడా తెచ్చిపెట్టింది. అందువలన త్వరలో ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాతో హిట్ కొట్టి ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేయాలని ఆయన చూస్తున్నాడు. 

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతుండటంతో, ముందుగా ఆయన నుంచి మాట తీసుకున్నాడట. ప్రభాస్ ఇప్పుడున్న ప్రాజెక్టులను పూర్తిచేయడానికి మరో ఏడాదికి పైన పడుతుంది. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమా 2025లో ఉండొచ్చని టాక్. ఈ లోగా కొరటాల మరో ప్రాజెక్టు కూడా చేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది.

More Telugu News