వైఎస్సార్ సేవలను కాంగ్రెస్, టీఆర్ఎస్ విస్మరించాయి: షర్మిల

  • ప్రజల హృదయాల్లో వైఎస్సార్ మహా నేతగా నిలిచిపోయారన్న షర్మిల 
  • హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారని వ్యాఖ్య 
  • ఆయనను స్మరించుకోవడానికి హైదరాబాద్ లో సెంటు స్థలం కూడా లేదని విమర్శ 
Congress and TRS neglected YSR says Sharmila

తన గొప్ప పాలనతో, సంక్షేమ పథకాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మహా నేతగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారని చెప్పారు. వైఎస్ సువర్ణ పాలనను ప్రజలు గుర్తించినా... ప్రభుత్వాలు మాత్రం గుర్తించలేదని అసహనం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ ను వైఎస్ ఎంతో అభివృద్ధి చేశారని... అలాంటి వ్యక్తిని స్మరించుకోవడానికి హైదరాబాదులో సెంటు స్థలం కూడా లేదని చెప్పారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ స్మారకం కోసం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారని... కానీ ఇప్పుడు ఆ స్థలాన్ని వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వైఎస్ సేవలను విస్మరించాయని షర్మిల అన్నారు. ఈ రోజు వైఎస్సార్టీపీ ఆవిర్భావ వేడుకలను హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News