నాన్నా... కోట్లాది మంది అభిమానుల చిరునవ్వుల్లో మిమ్మల్ని చూసుకుంటున్నా: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్
- నేడు వైఎస్సార్ జయంతి
- ఇడుపులపాయలో కుటుంబ సభ్యుల నివాళులు
- ట్విట్టర్ లో స్పందించిన సీఎం జగన్
- వైఎస్ ఆలోచనలే ప్రభుత్వానికి మార్గదర్శకమని వెల్లడి
"నాన్నా... మిమ్మల్ని ఆరాధించే కోట్ల మంది చిరునవ్వుల్లో నిత్యం మీ రూపం కనిపిస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన మీ జీవితమే నాకు స్ఫూర్తి. ప్రజా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచనలు ఈ ప్రభుత్వానికి మార్గదర్శకం" అంటూ ట్వీట్ చేశారు.