TDP: కోడి పందేల్లో చింత‌మ‌నేని... వీడియో విడుద‌ల చేసిన ప‌టాన్‌చెరు పోలీసులు

patancheru police rereases a video which show chintamaneni flee from the spot
  • పోలీసుల వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న చింత‌మ‌నేని
  • దాడుల స‌మ‌యంలో అక్క‌డి నుంచి వెళ్లిపోతున్న వైనం
  • కోడి పందేల‌తో సంబంధం లేద‌న్న చింత‌మ‌నేని ప్ర‌క‌ట‌న‌తోనే వీడియోల విడుద‌ల‌
హైద‌రాబాద్ న‌గ‌ర శివారు ప్రాంతం ప‌టాన్‌చెరు ప‌రిధిలో ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కోడి పందేలు నిర్వ‌హిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై పోలీసులు సంబంధిత వీడియోను గురువారం రాత్రి విడుద‌ల చేశారు. ఈ వీడియోలో కోడి పందేలు నిర్వ‌హిస్తున్న ప్రాంతంపై పోలీసులు దాడి చేసిన స‌మ‌యంలో అక్క‌డి నుంచి వెళ్లిపోతున్న చింత‌మ‌నేని దృశ్యాలు క‌నిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... తాను ప‌టాన్‌చెరులో కోడి పందేలను నిర్వ‌హించ‌లేద‌ని, అస‌లు వాటితో త‌న‌కు సంబంధం లేద‌ని చింత‌మ‌నేని గురువారం మ‌ధ్యాహ్నం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌ను చూసిన వెంట‌నే ప‌టాన్‌చెరు పోలీసులు స‌ద‌రు వీడియోను విడుద‌ల చేశారు. కోడిపందేల కీల‌క సూత్ర‌ధారి చింత‌మ‌నేని అని ఇదివ‌ర‌కే పోలీసులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
TDP
Chinthamaneni Prabhakar
Patancheru
Hyderabad

More Telugu News