సాయిపల్లవి 'గార్గి' నుంచి ట్రైలర్ రిలీజ్!

07-07-2022 Thu 19:08
  • సాయిపల్లవి ప్రధాన పాత్రధారిగా 'గార్గి'
  • తండ్రి కోసం కూతురు చేసే పోరాటం ఇతివృత్తం 
  • దర్శకుడిగా గౌతమ్ రామచంద్రన్ 
  • ఈ నెల 15వ తేదీన విడుదల   
Gargi trailer released
సాయిపల్లవి ప్రధాన పాత్రధారిగా తమిళంలో 'గార్గి' సినిమా రూపొందింది. గ్లోబల్ సినిమా .. టికెట్ ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను నిర్మించారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.

తెలుగులోను అదే టైటిల్ తో విడుదలవుతున్న ఈ సినిమాను, రానా సమర్పిస్తున్నాడు. గోవింద్ వసంత సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ఐశ్వర్యలక్ష్మి మరో ముఖ్యమైన పాత్రను పోషించింది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కథ ఏ అంశం చుట్టూ తిరగనుందనేది ట్రైలర్ లో చెప్పేశారు.

'గార్గి' ఒక మధ్యతరగతి యువతి. నెల్లూరులోని ఒక స్కూల్లో ఆమె టీచర్ గా పనిచేస్తుంటుంది. ప్రేమలో పడిన ఆమె పెళ్లికి రెడీ అవుతుండగా ఆమె తండ్రి ఒక కేసు విషయంలో అరెస్టు అవుతాడు. తండ్రిని కాపాడుకోవడం కోసం గార్గి ఏం చేసిందనేదే కథ. ఈ సినిమాపై తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది.