Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులను కుదించిన బ్రిటీష్ రాచకుటుంబం!

Queen Elizabeths Royal duties reduced due to health concerns
  • ఎలిజబెత్ రాణి వయసు 96 సంవత్సరాలు
  • ఆరోగ్య కారణాలతో రాయల్ డ్యూటీస్ ను తగ్గించిన వైనం
  • రాణికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం విధుల కుదింపు
బ్రిటీష్ సామ్రాజ్యానికి మహారాణి క్వీన్ ఎలిజబెత్. ప్రపంచంలో ఏ చక్రవర్తి అనుభవించనంత రాచరిక వైభవాన్ని ఆమె అనుభవించారు. బ్రిటన్ లో ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబం రాయల్ డ్యూటీస్ (రాచరికపు విధులు)ను అనుభవిస్తోంది. తాజాగా క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ ను తగ్గించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాచకుటుంబ వార్షిక నివేదికలో రాణి రాయల్ డ్యూటీస్ ను తగ్గించిన విషయాన్ని పేర్కొన్నారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఎలిజబెత్ రాణి విధులను సర్దుబాటు చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

క్వీన్ ఎలిజబెత్ వయసు 96 సంవత్సరాలు. గత ఫిబ్రవరిలో ఆమె కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆమె కోసం నిర్వహించిన ప్లాటినం జుబిలీ వేడుకులకు కూడా... వయసు ఇబ్బందుల కారణంగా ఆమె హాజరు కాలేకపోయారు. సెయింట్ పాల్ కేథడ్రల్ లో జరిగిన థ్యాంక్స్ గివింగ్ సర్వీసుకు కూడా ఆమె హాజరు కాలేదు. వయసు పెరిగిన నేపథ్యంలో, రాణికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆమె విధులను కుదించారు.  

ప్రతి ఈవెంట్ కు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనప్పటికీ... తన హృదయం ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటుందని ఎలిజబెత్ రాణి ఇటీవల తెలిపారు. తన కుటుంబ సహకారంతో తన శక్తి మేరకు మీకు సేవ చేస్తానని ఆమె అన్నారు.
Queen Elizabeth
Royal Duties
Health Concerns

More Telugu News