Eknath Shinde: డ్రమ్స్ వాయిస్తూ ఏక్ నాథ్ షిండేను ఆహ్వానించిన భార్య లత.. వీడియో వైరల్!

Eknath Shinde Wife Plays Drums To Welcome Him Home
  • సీఎం అయిన తర్వాత తొలిసారి సొంత నగరం థానేకు వచ్చిన షిండే
  • ఘన స్వాగతం పలికిన భార్య లత
  • షిండే రాజకీయ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన లత
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత తన సొంత నగరం థానేకు ఏక్ నాథ్ షిండే వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయన భార్య లతా ఏక్ నాథ్ షిండే డ్రమ్స్ వాయిస్తూ స్వాగతం పలికారు. డ్రమ్స్ బ్యాండ్ సెట్ తో కలిసి ఆమె ఎంతో హుషారుగా డ్రమ్స్ వాయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఏక్ నాథ్ షిండే రాజకీయ ఎదుగుదలలో ఆయన భార్య లత పాత్ర ఎంతో కీలకమైనది. వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నప్పుడు షిండే ఆటో డ్రైవర్ గా ఉండేవారు. వీరిద్దరికీ ముగ్గురు మగ పిల్లలు కాగా... 2000వ సంవత్సరంలో జరిగిన పడవ ప్రమాదంలో ఇద్దరు కుమారులు చనిపోయారు. 

ఇక నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో థానేలోని తన నివాసానికి ఏక్ నాథ్ షిండే వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వాహనంపై అభిమానులు పూల జల్లు కురిపించారు. తన ప్రియతమ నేత వస్తున్న నేపథ్యంలో, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా... వారంతా వర్షంలోనే తడుస్తూ ఇంటి వద్ద కొన్ని గంటల సేపు వెయిట్ చేశారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ, శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే సిద్ధాంతాలను నమ్మే వారికి న్యాయం చేసేందుకే సొంత పార్టీపై తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని  అన్నారు. 
Eknath Shinde
Wife
Latha
Drums

More Telugu News