తన యజమానికి ముద్దు ఇస్తున్న రామచిలుక.. దీని పలుకులు మామూలుగా లేవు!

06-07-2022 Wed 13:22
  • ఏది చెప్పినా తిరిగి అప్పజెబుతోన్న చిలుక
  • యజమాని భుజంపై కూర్చుని తియ్యటి కబుర్లు
  • ముద్దు కూడా ఇస్తున్న వైనం
Incredible bird calls pet mom cute speaks with her like a human
పెంపుడు జంతువులు అంటే పిల్లి, కుక్క అనే సాధారణంగా అనుకుంటారు. ఇతర జంతువులను సైతం మచ్చిక చేసుకుని ఇష్టంగా పెంచుకునే వారు బోలెడు మంది ఉంటారు. పులులు, సింహాలను కూడా ఇలా పెంచుకోవడాన్ని చూశాం. అలాగే రామచిలుకలు కూడా. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని రకాలు చక్కగా మాట్లాడతాయన్న విషయం కూడా మనకు తెలుసు. ఇలా మాట్లాడే శక్తి కలిగిన చిలుకల్లో ఇది కూడా ఒకటి. 

తన యజమాని భుజంపై కూర్చుని ఈ చిలుక చక్కగా లిప్ కిస్ ఇస్తోంది. రామ చిలుకల ముక్కు షార్ప్ గా ఉంటుంది. ఎందుకంటే పండ్లను తొలుచుకుని తినాలంటే, తనను తాను కాపాడుకోవాలంటే దానికి ఉన్న ఏకైక ఆయుధం ముక్కే. ఇక్కడ కిస్ ఇచ్చే సందర్భంలో తన ముక్కు యజమానికి పొడుచుకోకుండా చిలుక తీసుకుంటున్న జాగ్రత్త కూడా చూసే వారికి ముచ్చటగా అనిపిస్తోంది. మనం ఏది అంటే దానినే తిరిగి చెబుతోంది. ఈ వీడియోను రెడిట్ లో పోస్ట్ చేయగా, మంచి స్పందన కనిపిస్తోంది. దీన్ని చూసిన వారు కూడా మంచి కామెంట్లు పెడుతున్నారు. (వీడియో కోసం)