Agra: ఆగ్రా జామా మసీదులో తవ్వకాలు జరపాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్

  • న్యాయవాది వరుణ్ కుమార్ దాఖలు
  • మసీదు మెట్ల కింద ఠాకూర్ కేశవ్ దేవ్ విగ్రహం ఉందని వాదన
  • తగినన్ని ఆధారాల్లేవంటున్న మసీదు ఇమామ్
Petition at Allahabad HC seeks excavation of Agra Jama Masjid to dig up Hindu deity idol

ఆగ్రాలోని (ఉత్తరప్రదేశ్) చారిత్రక షాహి జామా మసీదులో తవ్వకాలకు భారత పురావస్తు పరిశోధన శాఖ (ఆర్కియోలాజికల్)ను ఆదేశించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది వరుణ్ కుమార్ దీన్ని దాఖలు చేశారు. మసీదు మెట్ల కింద ‘ఠాకూర్ కేశవ్ దేవ్ జీ’ విగ్రహ మూర్తి ఉన్నట్టు ఆయన వాదిస్తున్నారు. ఇదే అంశంపై వరుణ్ కుమార్ గతేడాది ఏప్రిల్ 14న మధుర సివిల్ జడ్జి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ విచారణకు తీసుకోలేదు. 

ఈ మసీదును షాజహాన్ కుమార్తె జహన్ అరా ప్రారంభించినట్టు జామా మసీదు ప్రతినిధి ఇమాముద్దీన్ తెలిపారు. తన వివాహం కోసం దాచుకున్న డబ్బును ఆమె మసీదు నిర్మాణానికి వినియోగించినట్టు చెప్పారు. జామా మసీదు మెట్ల కింద దేవతా విగ్రహం ఉందనడానికి బలమైన ఆధారాలు లేవని చెప్పారు. కనుక ఒకరి ఇష్టానుసారం మసీదు మొత్తాన్ని తవ్వడం సమర్థనీయం కాదన్నారు. 

మరోవైపు హిందుస్థానీ మిరాదారి వైస్ చైర్మన్ విశాల్ శర్మ స్పందిస్తూ ఈ తరహా వ్యాజ్యాలు సమాజంలో అశాంతిని కలిగించేందుకు ఉద్దేశించినవిగా పేర్కొన్నారు. వీటిని ఎంత మాత్రం ప్రోత్సహించరాదని అభిప్రాయపడ్డారు. 

More Telugu News