Ajmer Dargah: నుపుర్ శర్మ తల తెచ్చి ఇస్తే ఆస్తులు రాసిస్తానన్న అజ్మీర్ దర్గా ఖాదిమ్ అరెస్ట్

Khadim of Ajmer Dargah arrested for beheading threat to Nupur Sharma
  • వైరల్ అయిన సల్మాన్ చిస్తీ వీడియో
  • తల్లి మీద ప్రమాణం చేసి మరీ శపథం
  • ఆమె తల తెచ్చి ఇస్తే తన ఇల్లు రాసిచ్చేస్తానని ప్రమాణం
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ తల తెచ్చి ఇచ్చిన వారికి తన ఆస్తిని రాసిస్తానంటూ ఆఫర్ చేసిన అజ్మీర్ దర్గా ఖాదిమ్ సల్మాన్ చిస్తీని గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నుపుర్ శర్మ తలను ఖండించి తీసుకొచ్చిన వారికి తన ఆస్తులను ఇచ్చేస్తానన్న చిస్తీ వీడియో ఒకటి నిన్న వైరల్ అయింది. 

మూడు నిమిషాల నిడివున్న ఈ వీడియోలో చిస్తీ మాట్లాడుతూ.. ‘‘నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆమె (నుపుర్ శర్మ) ను బహిరంగంగా కాల్చి పారేస్తాను. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. ఆమెను కాల్చి చంపడం ఖాయం. అంతేకాదు, ఆమె తలను తీసుకొచ్చి ఇచ్చిన ఎవరికైనా సరే నా ఇంటిని ఇచ్చేస్తాను. ఇది సల్మాన్ శపథం’’ అని పేర్కొన్నాడు.  

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పోలీసులు స్పందించారు. అజ్మీర్‌లోని అల్వార్ గేట్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఆ వీడియోలో చిస్తీ తాగిన మత్తులో ఉన్నట్టు అజ్మీర్ ఏఎస్పీ వికాస్ సంగ్వాన్ తెలిపారు. కాగా, గత రాత్రి చిస్తీని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
Ajmer Dargah
Nupur Sharma
Salman Chishti
BJP

More Telugu News