ఉద‌య్‌పూర్ హ‌త్య కేసు నిందితుడు హైద‌రాబాద్‌లో అరెస్ట్‌

05-07-2022 Tue 21:35
  • నూపుర్ శ‌ర్మ‌కు అనుకూలంగా పోస్ట్ చేశాడ‌ని క‌న్న‌య్య హ‌త్య‌
  • హ‌త్య అనంత‌రం ఉద‌య్‌పూర్ నుంచి ప‌రారైన నిందితులు
  • హైద‌రాబాద్‌లో త‌ల‌దాచుకున్న బీహార్‌కు చెందిన నిందితుడు
  • పాత‌బ‌స్తీలో అరెస్ట్ చేసి రాజ‌స్థాన్ కు త‌ర‌లించిన ఎన్ఐఏ
udaypur murder accused arrested in hyderabad old city
దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన ఉద‌య్‌పూర్ హ‌త్య కేసు నిందితుడిని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగ‌ళ‌వారం అరెస్ట్ చేసింది. బీజేపీ బ‌హిష్కృత నేత నూపుర్ శ‌ర్మ‌కు అనుకూలంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడన్న కార‌ణంతో ఉద‌య్‌పూర్‌కు చెందిన టైల‌ర్ క‌న్న‌య్య సాహూను ఇటీవ‌లే ఇద్ద‌రు వ్య‌క్తులు అత్యంత దారుణంగా హత్య చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న రేకెత్త‌గా...కేంద్ర ప్ర‌భుత్వం ఈ కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల‌ను ఎన్ఐఏకు అప్ప‌గించింది. అదే స‌మ‌యంలో క‌న్న‌య్య‌ను హ‌త్య చేసిన నిందితులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. నిందితుల్లో బీహార్‌కు చెందిన ఈ నేర‌గాడు హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీలో త‌ల దాచుకున్నాడు. ఈ విష‌యంపై ప‌క్కా స‌మాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు మంగ‌ళ‌వారం పాత‌బ‌స్తీలో అత‌డిని అరెస్ట్ చేశారు. అనంత‌రం అత‌డిని రాజ‌స్థాన్ కు త‌ర‌లించారు.