‘కాళి’ సినిమాలో సిగరెట్ తాగుతున్నట్టుగా అమ్మవారి పోస్టర్.. దర్శకురాలిని అరెస్ట్ చేయాలంటూ నెటిజన్ల డిమాండ్
- ట్విట్టర్‌లో పోస్టర్ షేర్ చేసిన లీనా మణిమేకలై
- ఓ చేతిలో త్రిశూలం పట్టుకుని మరో చేతితో సిగరెట్ తాగుతున్నట్టుగా ఉన్న పోస్టర్
- అమిత్ షా, పీఎంవో జోక్యం చేసుకోవాలంటూ నెటిజన్ల డిమాండ్
డైరెక్టర్ లీనా మణిమేకలై ఈ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాళీమాత వేషధారణలో ఉన్న ఓ మహిళ సిగరెట్ తాగుతున్నట్టుగా అందులో ఉంది. ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో కొడవలితో ఉన్న ఆ మహిళ మరో చేతితో ఎల్‌జీబీటీక్యూ ప్లస్ (LGBTQ )కు చెందిన జెండాను పట్టుకుని ఉండడం గమనార్హం. ఆమె ఆ పోస్టర్‌ను షేర్ చేసిన వెంటనే లీనాపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. సినిమాను లాంచ్ చేసిన ఆగా ఖాన్ మ్యూజియం వెంటనే దానిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా, పీఎంవో వెంటనే జోక్యం చేసుకుని లీనాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.