ఇది ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా: రజనీకాంత్
- మాధవన్ ప్రధానపాత్రలో రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్
- స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన మాధవన్
- జులై 1న విడుదల
- చిత్రానికి విశేష ప్రజాదరణ
భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధి కోసం శాస్త్రవేత్త నంబి నారాయణన్ అనేక కష్టనష్టాలకు ఓర్చి పనిచేశారని రజనీకాంత్ వెల్లడించారు. ఆయన ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త జీవితాన్ని తెరకెక్కించే క్రమంలో మేటి దర్శకుల తీరులో మాధవన్ దర్శకత్వం ఉందని కొనియాడారు. ఇలాంటి ఉన్నతమైన చిత్రాన్ని అందించినందుకు మాధవన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అదే సమయంలో అభినందిస్తున్నానని రజనీకాంత్ ట్విట్టర్ లో ప్రకటన చేశారు.