భుజం విరగడంతో ఆసుపత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్
- పాట్నాలోని ఇంట్లో మెట్లపై నుంచి జారిపడ్డ లాలూ
- భుజం, వెన్నెముకకు గాయాలు
- పాట్నాలోని ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
74 ఏళ్ల లాలు ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఏడాది మొదట్లో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్నారు. దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో 2017 డిసెంబర్‌లో లాలుకు జైలు శిక్ష ఖరారైంది. ఈ ఏప్రిల్‌లో బెయిలుపై విడుదలైన తర్వాత ఢిల్లీలో ఉన్నారు. అనారోగ్య సమస్యలు కూడా రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి కోలుకున్నారు.