Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి డజనుకు పైగా విద్యార్థుల దుర్మరణం!

Over a dozen school children killed as a private bus falls into valley
  • కులు నుంచి సయంజ్ కు బస్సు వెళ్తుండగా ప్రమాదం
  • ఉదయం 8.30 గంటల సమయంలో లోయలో పడిన బస్సు
  • రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందన్న కులు డిప్యూటీ కమిషనర్
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. కులు ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో డజనుకు పైగా విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఉదయం ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సు తుక్కుతుక్కయింది. 

ఈ ఘటనపై కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ మాట్లాడుతూ... సయంజ్ కు బస్సు వెళ్తున్న క్రమంలో ఉదయం 8.30 గంటలకు జంగ్లా గ్రామం వద్ద ప్రమాదం సంభవించిందని చెప్పారు. జిల్లా అధికారులు, రెస్క్యూ టీములు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారని చెప్పారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారని తెలిపారు.  
Himachal Pradesh
Kullu
Bus Accident
Students
Dead

More Telugu News