విక్ర‌మ్ సినిమాను ఆకాశానికెత్తేసిన మ‌హేశ్ బాబు

02-07-2022 Sat 20:45
  • క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన విక్ర‌మ్‌
  • దేశవ్యాప్తంగా ప్ర‌శంస‌లందుకుంటున్న చిత్రం
  • కొత్త త‌ర‌హా సినిమాల‌కు నాందీ ప‌లికింద‌న్న మ‌హేశ్ బాబు
mahesh babu praises vikram movie
కోలీవుడ్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయకుడిగా తెర‌కెక్కి భారీ హిట్ కొట్టిన విక్ర‌మ్ సినిమాపై టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మ‌రో స్టార్ హీరో సూర్య‌, విజ‌య్ సేతుప‌తి, ప‌హ‌ద్ ఫాజిల్ త‌దిత‌రులు న‌టించిన సంగ‌తి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా ఈ చిత్రంపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

శ‌నివారం ఈ చిత్రంపై స్పందించిన మ‌హేశ్ బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశాడు. విక్ర‌మ్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింద‌ని కొనియాడాడు. కొత్త త‌ర‌హా సినిమాకు ఈ సినిమా నాందీ పలికింద‌ని మ‌హేశ్ బాబు కీర్తించాడు. ఈ సినిమా క‌థ‌పై పూర్తి స్థాయిలో చ‌ర్చించేందుకు మిమ్మ‌ల్ని క‌లుస్తాన‌ని క‌న‌కరాజ్‌కు తెలిపారు. అత్య‌ద్భుత‌మైన క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారంటూ మ‌హేశ్ కీర్తించాడు.