అందాల కృతి శెట్టి ఆర్డర్ తప్పింది!

02-07-2022 Sat 18:15
  • టాలీవుడ్లో కృతి శెట్టికి విపరీతమైన క్రేజ్ 
  • కొత్త కథానాయికల్లో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఘనత ఆమెదే
  • 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రిలీజ్ డేట్ విషయంలో రాని స్పష్టత
  • ఈ నెల 14వ తేదీన  విడుదలవుతున్న 'ది వారియర్' 
The Warrior Movie Update
ఈ మధ్య కాలంలో కృతి శెట్టి వంటి అందాల కథానాయిక తెలుగు తెరకి పరిచయం కాలేదు. అడుగుపెడుతూనే యూత్ ను .. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నవారు లేరు. ఒక సినిమాకి మించిన సక్సెస్ మరో సినిమాతో సాధిస్తూ హ్యాట్రిక్ హిట్ కొట్టినవారూ లేరు. అందువల్లనే టాలీవుడ్ లో అంతా ఆమెది గోల్డెన్ లెగ్ అని చెప్పుకుంటున్నారు.

ఆమె చేసిన సినిమా చేసినట్టుగా ఒకదాని తరువాత ఒకటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 'ఉప్పెన' .. 'శ్యామ్ సింగ రాయ్' .. 'బంగార్రాజు' ఇలా వరుస హిట్లను నమోదు చేసింది. అయితే ఆమె అనుకున్న ఆర్డర్ నుంచి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా మాత్రం పక్కకి తప్పుకుంది. 

సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావలసింది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇంతవరకూ చెప్పలేదు. కానీ ఆ తరువాత సినిమాగా ఆమె చేసిన 'ది వారియర్' మాత్రం ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వస్తోంది. ఆ తరువాత లైన్లో నితిన్ 'మాచర్ల నియోజకవర్గం ఉండనే ఉంది.