హీరో కార్తికేయ సందడి ఎక్కడా కనిపించదేం!

02-07-2022 Sat 17:53
  • హీరోగా వరుస ఫ్లాపులతో ఉన్న కార్తికేయ
  • విలన్ గాను నిరాశపరిచిన 'వలిమై'
  • కొత్త ప్రాజెక్టులలో కనిపించని పేరు
  • సినిమా ఫంక్షన్స్ లోను కనిపించని కార్తికేయ 
karthikeya Special
హీరో కార్తికేయ ' ఆర్ ఎక్స్ 100' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యాడు. యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను ఆయనకి ఆ సినిమా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన ఎంతమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే అవేవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

'చావు కబురు చల్లగా' .. 'రాజా విక్రమార్క' వంటి విభిన్నమైన సినిమాలను కూడా చేశాడు. పెద్ద బ్యానర్లలో చేసిన ఆ సినిమాలు కూడా ఆయనను నిరాశపరిచాయి. దాంతో 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్ గా మెప్పించిన ఆయన,  ఏకంగా తమిళ తెరపై అజిత్ తో తలపడ్డాడు. తన పర్సనాలిటీతో కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. 

అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా కూడా  తమిళంలో తప్ప, మిగతా భాషల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఆ తరువాత ఏదో సినిమా చేస్తున్నట్టుగా కార్తికేయ చెప్పాడు గానీ, ఆ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నాడనేది తెలియడం లేదు. తన తోటి హీరోల సినిమా ఫంక్షన్స్ లో స్టేజ్ పై సందడి చేసే ఆయన, ఈ మధ్య కనిపించకపోవడం ఆశ్చర్యం.