YSRCP: మాస్ట‌ర్స్‌లో డిస్టింక్ష‌న్‌తో పాసైన‌ జ‌గ‌న్ కూతురు హ‌ర్షిణి రెడ్డి.. ప‌ట్టా తీసుకున్న వీడియో ఇదిగో

ys jagan daughter harshini reddy completes her masters with distinction
  • ఫ్రాన్స్‌లో ఉన్న‌త విద్య‌న‌భ్య‌సించిన హ‌ర్షిణి రెడ్డి
  • మాస్ట‌ర్స్ పూర్తి చేసిన జ‌గ‌న్ త‌న‌య‌
  • త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలోనే ప‌ట్టా పుచ్చుకున్న వైనం
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూతురు వైఎస్ హ‌ర్షిణి రెడ్డి మాస్ట‌ర్స్‌లో స‌త్తా చాటారు. ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌కు చెందిన వ‌ర్సిటీలో మాస్ట‌ర్స్ విద్య‌న‌భ్య‌సించిన హ‌ర్షిణి శ‌నివారం మాస్ట‌ర్స్ ప‌ట్టా అందుకున్నారు. మాస్ట‌ర్స్‌లో ఆమె డిస్టింక్ష‌న్‌తో స‌త్తా చాటారు. ఈ మేరకు వ‌ర్సిటీ నుంచి హ‌ర్షిణి రెడ్డి ప‌ట్టా తీసుకుంటున్న వీడియోను వైఎస్సార్సీపీ డిజిట‌ల్ మీడియా సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. 

కూతురు మాస్ట‌ర్స్ పూర్తి చేసి ప‌ట్టా పుచ్చుకునే కార్య‌క్ర‌మం(స్నాతకోత్స‌వం)లో పాలుపంచుకునేందుకు ఇప్ప‌టికే జ‌గ‌న్ దంప‌తులు పారిస్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలోనే హ‌ర్షిణి రెడ్డి ప‌ట్టా పుచ్చుకున్నారు. హ‌ర్షిణి రెడ్డి ప‌ట్టా పుచ్చుకునే వీడియోపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.
YSRCP
YS Jagan
Y.S. Harshini Reddy

More Telugu News