గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

02-07-2022 Sat 16:31
  • ఇటీవ‌లే మొహాలీలో ఐఎస్‌బీ త‌ర‌గ‌తుల‌కు హాజ‌రైన వంశీ
  • అక్క‌డే అస్వ‌స్థ‌త‌కు గురైన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే
  • ఏఐజీ ఆసుప‌త్రి వైద్య ప‌రీక్ష‌ల్లో కరోనా నిర్ధార‌ణ
  • వంశీతో క‌రోనా బారిన ప‌డ్డ ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరిన వైనం
gannavaram mla vallabhaneni vamsi mohan tests positive for corona
ఏపీలో శనివారం ఒక్క రోజే ముగ్గురు ఎమ్మెల్యేలు క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. ఈ ముగ్గురు నేత‌లు కూడా అధికార పార్టీకి చెందిన వారే కావడం గ‌మ‌నార్హం. గుంటూరు జిల్లా పరిధిలోని ప్ర‌త్తిపాటి ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత‌, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిలు క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించి ఆ త‌ర్వాత వైసీపీకి ద‌గ్గ‌రైన వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తేలింది.

ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్లాసుల కోసం ఇటీవ‌లే మొహాలీ వెళ్లిన వంశీ అక్క‌డే అస్వ‌స్థ‌త‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అక్క‌డే ప్రాథ‌మిక వైద్యం చేయించుకున్న త‌ర్వాత ఐఎస్‌బీ క్లాసుల‌ను ముగించుకుని హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన వంశీ... న‌గ‌రంలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించున్నారు. ఈ ప‌రీక్ష‌ల్లో భాగంగా ఆయ‌న‌కు కరోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో హైద‌రాబాద్‌లోని త‌న ఇంటిలోనే హోం ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయిన వంశీ.. ఇటీవ‌ల త‌నను క‌లిసిన వారు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు.