నాని 'దసరా' సినిమా కోసం భారీ సెట్ !

01-07-2022 Fri 18:07
  • షూటింగు దశలో 'దసరా' 
  • దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల పరిచయం
  • నాని జోడీగా రెండోసారి నటిస్తున్న కీర్తి సురేశ్ 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న సంతోష్ నారాయణ్
Dasara movie upadate
కొత్త కథలకు ప్రాధాన్యతను ఇవ్వడంలోను .. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలోను నాని ముందుంటాడు. అలా ఆయన మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. ఆ సినిమా పేరే 'దసరా' .. ఆ దర్శకుడి పేరే శ్రీకాంత్ ఓదెల. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో నాని తెలంగాణ ప్రాంతంలో .. విలేజ్ నేపథ్యంలోని మాస్ యువకుడిగా కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా కీర్తి సురేశ్ కనిపించనుంది. 'నేను లోకల్' తరువాత ఆమె నానీతో చేస్తున్న సినిమా ఇది. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాదులో మొదలైంది. ఈ సినిమా కోసం ఇక్కడ ఒక భారీ సెట్ ను వేశారట. మేజర్ పార్టు షూటింగు ఈ సెట్లో జరగనుందని అంటున్నారు. ముఖ్యమైన పాత్రధారులందరి కాంబినేషన్ సీన్స్ ఇందులో ఉంటాయని చెబుతున్నారు. ఈ షెడ్యూల్ తో చాలావరకూ షూటింగు పూర్తవుతుందని అంటున్నారు.